సువార్త కార్యము యొక్క విజయము లేదా వైఫల్యము దేవుని యందు మన విశ్వాసము ఎంత బలంగా ఉన్నదో దానిపై ఆధారపడియున్నది. గిద్యోను మరియు యెహోషువా దినాలలో దేవుడు మనకు యుద్ధాలలో చూపించినట్లుగానే, తమ వాతావరణం మరియు పరిస్థితుల వల్ల విశ్వాసం కదిలిపోయినవారు దేవుని సైన్యం నుండి మినహాయించబడతారు, మరియు దేవుని యందు ధృడమైన విశ్వాసం ఉన్నవారు మాత్రమే విజయ చరిత్రను వ్రాయడానికి ఉపయోగించబడతారు.
ఏ మానవుడూ ఊహించలేని విధంగా దేవుడు ప్రతి యుగాన్ని నడిపించారు. పరిశుద్ధాత్మ యుగంలో కూడా, “లోకాన్ని రక్షించండి” అనే క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని యొక్క వాక్యములను మనం పూర్తిగా విశ్వసించినప్పుడు, రాజ్య సువార్తను పూర్తి చేయుటకు పరలోక సైన్యం యొక్క కార్యమును మనం పూర్తి చేస్తాము.
క్రీస్తు యేసు యొక్క మంచి సైనికునివలె నాతోకూడ శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు, తన్ను దండులో చేర్చుకొనినవానిని సంతోషపెట్టవలెనని యీ జీవన వ్యాపారములలో చిక్కు కొనడు.౹ 2 తిమోతి 2:3–4
అయితే యేసు వారియొద్దకు వచ్చి–పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తివరకు సదాకాలము మీతోకూడ ఉన్నానని వారితో చెప్పెను. మత్తయి 28:18–20
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం