పరిశుద్ధగ్రంథం యొక్క 66 గ్రంథాలు రక్షకుని వద్దకు వచ్చే మార్గమును మరియు అబద్ధము నుండి సత్యమును భేదమెంచుటకు గల మార్గమును కలిగియున్నందున, దేవుడు మనలను పరిశుద్ధగ్రంథమునకు ఏదీ కలపక, అందులో నుండి ఏదీ తీసివేయక, దేవుని వాక్యముల ప్రకారంగా మాత్రమే వెంబడించవలెనని హెచ్చరిస్తున్నారు. రెండువేల సంవత్సరాల క్రితం, యేసు ఒంటరిగా “జీవ జలమును పొందుకొనుటకు నా యొద్దకు రండి” అని కేకలు వేశారు, కాని ఇప్పుడు మనం జీవ జలమును పొందుకొని నిత్య జీవము కలిగియుండుటకు ఆత్మ మరియు పెండ్లికుమార్తె వద్దకు రావలెనని ఆయన మనకు బోధించారు.
దేవుడు తన పిల్లలను జీవ జలముల ఊట వద్దకు నడిపించునని యెషయా ప్రవచించాడు, మరియు పరిశుద్ధగ్రంథం యొక్క ప్రవచనాలన్నిటినీ నెరవేర్చిన పరిశుద్ధాత్ముడైన దేవుడు అన్ సాంగ్ హోంగ్ గారు, పరిశుద్ధాత్మ యొక్క పెండ్లికుమార్తె మరియు జీవ జలముల యొక్క ఊట అయిన పరలోక తల్లి యెరూషలేము వద్దకు మానవాళిని నడిపించారు.
ఆత్మయు పెండ్లికుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పిగొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ప్రకటన 22:17
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –అనుకూలసమయమందు నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరమిచ్చితిని రక్షణదినమందు నిన్ను ఆదుకొంటిని . . . వారియందు కరుణించువాడు వారిని తోడుకొనిపోవుచు నీటిబుగ్గలయొద్ద వారిని నడిపించును . . . యెషయా 49:8-10
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం