ఇశ్రాయేలీయులు నిర్గమించిన సమయంలో, ఐగుప్తు అంతటా వినాశనములు వచ్చెను, కాని ఇశ్రాయేలీయులపైకి వినాశనములు రాలేదు. ఇది ఖచ్చితంగా దేవుని నిబంధన ఉన్న స్థలానికి మరియు అది లేని స్థలానికి మధ్యన తేడా. తన ఆజ్ఞ—క్రొత్తనిబంధన పస్కా—ఆచరించబడిన చోటల్లా, తన ప్రజలు లోనికి వచ్చునపుడు దీవింపబడెదరు మరియు వారు బయటకు వెళ్ళునపుడు దీవించబడెదరు, మరియు ఆయన వారిని భూమిపై ఉన్న సకల జనుల కంటే ఉన్నతంగా ఉంచుననే గొప్ప వాగ్ధానమును దేవుడు ఇచ్చారు.
దేవుని విశ్రాంతి దినము మరియు పస్కాతో కూడిన క్రొత్త నిబంధనను లోకము ఆచరించనందున, ఈ భూమిపైకి ఒక గొప్ప అగ్ని వినాశనము వచ్చునని ప్రవక్తలైన యెషయా, జెఫన్యా మరియు పేతురు సాక్ష్యమిస్తున్నారు. దేవుని నిబంధనను గైకొంటేనే మానవాళి తండ్రియైన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారికి మరియు తల్లియైన దేవునికి పిల్లలుగా మారగలరని, అన్ని వినాశనముల నుండి దేవుని రక్షణను పొందగలరని పరిశుద్ధగ్రంథము సాక్ష్యమిస్తున్నది.
నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొనినయెడల నీ దేవుడైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినయెడల ఈ దీవెనలన్నియు నీమీదికి వచ్చి నీకు ప్రాప్తించును. . . . నీవు లోపలికి వచ్చునప్పుడు దీవింపబడుదువు; వెలుపలికి వెళ్లునప్పుడు దీవింపబడుదువు. ద్వితీయోపదేశకాండము 28:1–6
నీవు ఈ మాటలన్నియు ఈ ప్రజలకు తెలియ జెప్పిన తరువాత వారు–దేనిబట్టి యెహోవా మాకు ఈ ఘోరబాధ అంతయు నియమించెను? మా దేవుడైన యెహోవాకు విరోధముగా మా దోషమేమి? మాపాప మేమి? అని నిన్నడుగగా నీవు వారితో ఇట్లనుము––మీపితరులు నన్ను విడిచి అన్యదేవతలను అనుసరించి పూజించి . . . నా ధర్మశాస్త్రమును గైకొనక నన్ను విసర్జించిరి. యిర్మీయా 16:10–11
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం