దేవుని బోధనల ప్రకారము దేవుని పిల్లలు లోకమునకు ఉప్పు మరియు వెలుగుగా మారినపుడు, తమ మంచి క్రియల ద్వారా దేవుని మహిమను కనపరచి, క్రొత్త నిబంధన సత్యముతో మానవాళిని దేవుని వద్దకు నడిపించినపుడు, వారు ఆయన యెదుట నిలబడే దినమున దేవుడు సంతోషించి వారికి ఉప్పొంగే ఆశీర్వాదాలను అనుగ్రహించును.
పరిశుద్ధాత్మ యొక్క యుగంలో మనం క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు యెరూషలేము పరలోక తల్లిని పొందుకున్నట్లైతే, ఇప్పటి నుండి మనం ఈ లోకం నుండి నేర్చుకున్న దుష్ట అలవాట్లను విడిచిపెట్టి, క్రైస్తవులుగా నూతన స్వభావమును ధరించుకొనవలెను. ఈ లోకము ఎక్కువగా దైవభక్తిని కోల్పోయి వక్రబుద్ధిగాను దుష్టత్వముగాను మారుచున్నకొద్దీ, నోవహు మరియు లోతు దినాలలో వలెనే దేవుని తీర్పు దినము సమీపించినదని మనం గ్రహించి, మరింత దైవభక్తిగల జీవితమును జీవించవలెను.
కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి. రోమీయులకు 12:1–2
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం